Header Banner

భారత త్రివిధ దళాల శక్తి చూసి నా జీవితం ధన్యం! ప్రధాని మోదీ ప్రశంసలు!

  Tue May 13, 2025 18:41        Politics

ఆదంపూర్ ఎయిర్ బేస్‌లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. “భారత్ మాతా కీ జై” నినాదాలతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. యుద్ధక్షేత్రంలోనూ సైనికులు ఈ నినాదాలతో పోరాడారని గుర్తు చేస్తూ, ఇది శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతున్నదని అన్నారు. ఉగ్రవాదానికి అంతం కట్టేందుకు భారత సైన్యం శపథం చేసిందని, వారు చూపిన శౌర్యం, శక్తి సామర్థ్యాలపై తనకెంతో గర్వంగా ఉందని తెలిపారు. వీర సైనికుల వల్లే ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిందని పేర్కొన్నారు.
భారత త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని భయపెట్టాయని, డ్రోన్లు, మిసైళ్లతో శత్రు స్థావరాలను ధ్వంసం చేశారని వివరించారు. పాకిస్థాన్ ప్రయాణికుల విమానాలను కవచంగా వాడే ప్రయత్నం చేసినా, మన వైమానిక దళం అత్యున్నత నైపుణ్యంతో ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసిందని చెప్పారు. శత్రువు మన త్రివిధ దళాల ప్రతాపానికి భయపడే స్థితిలో ఉందని, మళ్లీ ఉగ్రదాడి చేస్తే భారత్ ఎలా స్పందిస్తుందో పాక్‌కి అర్థమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండిఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PMModi #IndianArmy #OperationSindoor #BharatMataKiJai #IndianForces #ModiSpeech #IndiaStrikesBack